షర్మిల పార్టీ? లాభమా? నష్టమా?

తెలంగాణలో రాజకీయ పార్టీ పెడుతున్నట్టు వైఎస్ షర్మిల చేసిన ప్రకటన రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.అధికార టీఆర్ఎస్ పార్టీ షర్మిల పార్టీ పెడితే లాభమా? నష్టమా? అనే కోణంలో లెక్కలు వేసుకుంటోంది.

తెలంగాణ వచ్చాక వైఎస్ ఫ్యామిలీ కుటుంబం మళ్లీ తెలంగాణ పాలిటిక్స్ పై దృష్టి సారించింది.తెలంగాణలో రాజన్న రాజ్యం తేవడానికి ప్రయత్నిస్తానని షర్మిల ప్రకటించారు.ఎన్నికలకు మరో రెండు మూడేళ్ల సమయం ఉండటంతో పక్కా ప్రణాళికతోనే రాష్ట్రంలో పొలిటికల్ ఎంట్రీకి షర్మిల సిద్ధమయ్యారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

షర్మిల తెలంగాణలో పార్టీ పెడితే పరిస్థితులు ఎలా ఉంటాయన్న విషయాలపై టీఆర్ఎస్ నేతల్లో చర్చలు మొదలయ్యాయి.గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సన్నిహితంగా ఉన్న వారిలో ఒకరిద్దరు మినహా చాలామందికి కీలక పదవులు లేవు. ఈ పరిస్థితుల్లో ఆ నేతలు టీఆర్ఎస్‌లో ఉంటారా? వైఎస్ పై అభిమానంతో షర్మిలకు దగ్గరవుతారా? అన్న చర్చ జరుగుతున్నట్టు సమాచారం.షర్మిల పార్టీ వల్ల టీఆర్ఎస్ కు ఎంతవరకు లాభం,ఎంతవరకు నష్టం అన్న కోణంలో నేతలు లెక్కలు వేస్తున్నారు.

Tags:#YSSharmila

Leave a Response