దిశపై హత్యాచారానికి పాల్పడ్డారనడానికి రుజువు ఏమిటి?

What is the proof for disha murder?

చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని నిందితులను ఎన్ కౌంటర్లు చేయడం సరికాదంటోన్న మానవ హక్కుల సంఘాలు. అసలు ఆ నలుగురే దిశపై హత్యాచారానికి పాల్పడ్డారనడానికి రుజువు ఏమిటని ప్రముఖ నటుడు, ఉత్తమ ప్రజాకీయ పార్టీ వ్యవస్థాపకుడు ఉపేంద్ర ప్రశ్నించారు. దిశపై దారుణానికి పాల్పడింది ఆ నలుగురు కాదేమో? ప్రముఖుల హస్తం ఉందేమోనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దిశ కేసులో జరిగిన విధంగా ప్రముఖుల రేప్ కేసుల్లో ఎందుకు జరగడం లేదని నిలదీశారు. పోలీసులు మనసు పెడితే ఎన్ కౌంటర్ల ద్వారా అత్యాచారాలను నియంత్రించవచ్చని అన్నారు. దిశపై హత్యాచారానికి పాల్పడింది ఆ నలుగురో కాదోనంటూ ఉపేంద్ర చేసిన వ్యాఖ్యలపై పలువురు మండిపడుతున్నారు. దిశ నిందితుల ఎన్ కౌంటర్ ను పలువురు ప్రముఖులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బాధ్యతాయుతంగా ఉండాల్సిన ఉపేంద్ర ఇలా దిశ నిందితుల ఎన్ కౌంటర్ ను వ్యతిరేకించడం సరికాదని హితవు పలుకుతున్నారు. ఏదైనాసరే చట్ట ప్రకారమే చేయాలని న్యాయ వ్యవస్థ ద్వారా మాత్రమే శిక్షించాలని కోరుతున్నారు.

Tags:disha casejustice for dishaupendra

Leave a Response