నన్ను ఓడించడానికి రూ.150 కోట్లు ఖర్చు చేశారట – జనసేనాని

మొన్న జరిగిన ఎన్నికల్లాలో జనసేన పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము లో పోటీ చేసి ఓటమిని చవి చూసారు. జనసేన కి ఈ విషయం లో అన్నయ్యం జరిగింది అని చెప్పాలి. గత 30 సంవత్సరాలుగా ఉద్దానం కిడ్నీ సమస్యలు ఉన్న పట్టించుకోని మన రాజకీయ నాయకులను మనం చూశాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉద్దానం వెళ్లి అక్కడ బాధితులను కలిసి వారి కోసం నిరాహార దీక్ష చెప్పట్టారు. అలాంటి ఎన్నో సమస్యలకు జనసేనాని వచ్చాక అక్కడి ప్రజల సమస్యలు తీరాయి కానీ డబ్బుకు మద్యంకు అలవాటు పడ్డ మన ప్రజలు ఆయనకు మంచి గుణపాఠం నేర్పారని అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇదంతా ఎలా ఉండగా ఈ మధ్య నాదెండ్ల పార్టీ ని విడి బీజేపీ లో కి వెళ్తున్నారని వార్తల పై జనసేనాని ఖండించారు. ఇప్పటివరకూ తన ఆశయాలను చూశారని, ఇకపై తన రాజకీయం చూస్తారని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. తాజాగా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించిన ఆయన మాట్లాడారు. ‘‘ఆశయాలతో వస్తే నిన్నే ఓడించారు’ అని కొందరు నాతో అన్నారు. భీమవరంలో నన్ను ఓడించడానికి రూ.150 కోట్లు ఖర్చు చేశారట. ఒక్క వీరవాసరం మండలానికి రూ.30కోట్లు ఇచ్చినట్లు అక్కడి రాజకీయ వర్గలు గుసగుసలాడుతున్నాయని చెబుతున్నారు. నేను ఎవరిని నుంచి ఏమీ ఆశించలేదు. మీరు చప్పట్లు కొట్టినా మెచ్చుకున్నా, తిట్టినా నా పని నేను చేసుకుంటూ వెళ్లా. నిజమైన రాజకీయం, వ్యూహాలు, ఎత్తుగడలు వేయలేక కాదు. చేతకాక కాదు. ఈసారి నా వ్యూహాలు చాలా బలంగా ఉంటాయి. ఆశయాలతో ఉండే పవన్‌కల్యాణ్‌ను మీకు చూపించానంతే. ఇక నుంచి మార్పు వచ్చే వరకూ ఎత్తులు, పైఎత్తులు వేస్తూ ఉంటా. శ్రీకాకుళంలో వలసలు ఆగే వరకూ వేస్తా. జర్మనీ నుంచి నాకోసం 500మంది వచ్చారు. అలాంటి వాళ్ల కోసం నేను రాజకీయాల్లో ఉండిపోతా. ఇప్పటివరకూ నా ఆశయాలు చూశారు. ఇకపై నా రాజకీయాలు చూస్తారు. నేను స్వార్థంతో రాజకీయాల్లోకి రాలేదు. సమాజ శ్రేయస్సు కోసం వచ్చా’’ అని కార్యకర్తలు జనసేనాని అన్నారు.

Leave a Response