చిత్తూరు జిల్లాలో హెరిటేజ్ ప్లాంట్ పై దాడి! కరణము ఎవరు?

చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు సమీపంలోని హెరిటేజ్‌ ప్లాంట్ పై నిన్న రాత్రి దాదాపు 20 మంది దాడి చేయడం కలకలం రేపింది. స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం, నిన్న రాత్రి ఈ ప్లాంట్ వద్దకు వచ్చిన మనోజ్‌ అనే వ్యక్తి పెరుగు కావాలని అడిగాడు. అప్పటికే, పాలు, పాల పదార్థాల విక్రయ కేంద్రం మూసేసి ఉంది. దీంతో సెక్యూరిటీ ఆఫీస్‌ వద్దకు వెళ్లిన మనోజ్, పెరుగు ఇవ్వాలని అడిగాడు. సెంటర్ ను మూసేశారని, రేపు ఉదయం వచ్చి తీసుకోవాలని చెప్పారు, మనోజ్ ఇప్పుడే పెరుగు కావాలని వాగ్వాదానికి దిగాడు. ఆపై పెరుగు ఇవ్వడం లేదని తన బంధుమిత్రులకు చెప్పడంతో, దాదాపు 20 మంది అక్కడికి దూసుకొచ్చారు. సెక్యూరిటీ ఆఫీస్ అద్దాలను ధ్వంసం చేశారు.

ప్లాంటు లోపలికి బలవంతంగా వెళ్లి అక్కడి కార్మికులను, ఉద్యోగులను కొట్టారని అక్కడ ఉన్న వారు సమాచారం ఇచ్చారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడిండి , హెరిటేజ్‌ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల బృందం హెరిటేజ్ సెంటర్ కు వచ్చి, ఆందోళనకారులను బయటకు పంపి, సెక్యూరిటీ సిబ్బందిని ప్రశ్నించి వివరాలు అడిగారు. ఈ దాడికి సంబంధించి ఇప్పటివరకూ ఎటువంటి లిఖితపూర్వక ఫిర్యాదు అందలేదని జీడీ నెల్లూరు ఎస్ఐ నాగసౌజన్య వెల్లడించారు. మరి ఇంత జరిగిన హెరిటేజ్ కంపెనీ ఎందుకు కంప్లేటే ఇవ్వలేదని దాని పై వైసీపీ వర్గాలు గుస గుస లాడుతున్నాయి.

Tags:cbncbn newschandrababu naiduheritage

Leave a Response