జనసేనకు రాజీనామా చేసిన రావెల… నేడు మోదీ సమక్షంలో బీజేపీలో చేరిక!

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చాల చురుకుగా మారిపోతున్నాయి. టిడిపీ కండువాను వదిలి జనసేన కండువా కప్పుకున్న మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, నేడు ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు. నేడు ప్రధాని తిరుమల పర్యటన సందర్భంగా ఆయన్ను కలిసి బీజేపీలో చేరాలని రావెల నిర్ణయించుకున్నారని సమాచారం. రేణిగుంట ఎయిర్ పోర్టులోనే రావెల ప్రధానిని కలుస్తారని తెలుస్తోంది. రావెలతో పాటు పలు పార్టీలకు చెందిన నేతలు కూడా బీజేపీలో చేరనుంన్నారని సమాచారం. వీరికి మోదీ స్వయంగా కండువాలు కప్పనున్నారు. కాగా, నిన్న రావెల జనసేన పార్టీకి రాజీనామా లేఖ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి పంపించారనే సంగతి తెలిసిందే. పార్టీలో కీలక నేతగా ఉన్న రావెల, ఇప్పుడు బీజేపీలో చేరితే, ఆయన మూడోసారి పార్టీ మారినట్టు అవుతుంది.

Leave a Response