ఆయన కూతురు కవిత బతుకమ్మ ఆడితే చలా..!

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పండగ వేళ ప్రజలు పడుతున్న ఇబ్బందులు గాలికి వదిలేసి కేసీఆర్‌ నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఆయన కూతురు కవిత బతుకమ్మ ఆడితే చాలని, ప్రజలకు పండగ అవసరం లేదని కేసీఆర్‌ భావిస్తున్నట్లు ఉందని అన్నారు. ఆర్టీసీ సమ్మెకు కేసీఆర్‌ పూర్తి బాధ్యుడని, ఆయన కుట్రలను తిప్పికొట్టాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఆర్టీసీ సమ్మెకు పూర్తి మద్దతు ప్రకటించిన జీవన్‌రెడ్డి కేసీఆర్‌ నిప్పుతో చెలగాటం ఆడుతున్నాడని, మాడి మసై పోవడం ఖాయమని అన్నారు. సర్వీసులు పూర్తిగా నిలిచి పోయాయి, దీంతో సొంతూర్లకు ఎలా చేరాలా అని సతమతమవుతున్న ప్రజలను పట్టించుకోకుండా కేసిఆర్ ఎం చేస్తున్నారు అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.

Tags:jeevan reddytrs party

Leave a Response