శ్రీవిష్ణు కథానాయకుడిగా దర్శకుడు కృష్ణ విజయ్ ‘తిప్పరా మీసం’ సినిమాను రూపొందించాడు. నిక్కీ తంబోలి కథానాయికగా నటించిన ఈ సినిమాను, ఈ నెల 8వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. వ్యసనాలకు బానిసై .. విచ్చలవిడి జీవితాన్ని గడిపే పాత్రలో శ్రీవిష్ణు కనిపిస్తున్నాడు.అందరూ నేను అర్థంకాని ఎదవనని అనుకుంటున్నారు .. ఎవడేమనుకుంటే నా కేంటి? .. నేను అనుకున్నదే చేస్తా” అంటూ శ్రీవిష్ణు చెప్పే డైలాగ్, ఆయన పాత్ర స్వభావాన్ని చాటి చెబుతోంది. ఆయన తల్లి పాత్రలో ‘రోహిణి’ కనిపిస్తోంది. డిఫరెంట్ లుక్ తో .. నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో శ్రీవిష్ణు బాగా చేశాడనిపిస్తోంది. ‘బ్రోచేవారెవరురా’ తరువాత ఆయన నుంచి వస్తున్న ఈ సినిమా కూడా విజయాన్ని తెచ్చిపెడుతుందేమో చూడాలి.
previous article
వెంకీమామ లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్.
next article
ఇక నో మూవీస్ ఓన్లీ ఫ్యామిలీ….
Related Posts
- /No Comment
మహేష్, వంశీ పైడిపల్లి కాంబినేషన్లో…
- /No Comment