ఇక నో మూవీస్ ఓన్లీ ఫ్యామిలీ….

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవలి కాలంలో వరుసగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. బ్రేక్ లేకుండా ఒక సినిమా పూర్తయిన వెంటనే మరో సినిమాను అభిమానుల ముందుకు తెస్తున్నాడు మన మిల్క్ బాయ్. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమా చేస్తున్న సూపర్‌స్టార్ తర్వాతి సినిమా గురించి ఇంకా క్లారిటీ లేదు. టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం సరిలేరు నీకెవ్వరు తర్వాత మహేష్ బాబు మూడు నెలల పాటు బ్రేక్ తీసుకోబోతున్నాడట. డిసెంబర్ నెలలో సరిలేరు నీకెవ్వరు షూటింగ్ పూర్తవుతుంది. ఆ తర్వాత మార్చి నెల వరకు మహేష్ బ్రేక్ తీసుకుంటాడట. పూర్తిగా కుటుంబం కోసం సమయం కేటాయిస్తాడట. వంశీ పైడిపల్లి ప్రస్తుతం మహేష్ సినిమా కోసం స్క్రిప్టు సిద్ధం చేస్తున్నాడు. ఆ పనులు ఫిబ్రవరి నాటికి పూర్తవుతాయని తెలుస్తోంది. మార్చి నెల రెండో వారం నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని సమాచారం.

Image result for mahesh babu

Leave a Response