వెంకీమామ లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్.

వెంకటేశ్ – నాగచైతన్య కథానాయకులుగా బాబీ దర్శకత్వంలో ‘వెంకీమామ’ రూపొందింది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో వెంకీ సరసన పాయల్ .. చైతూ జోడీగా రాశి ఖన్నా కనిపించనున్నారు. రేపు సాయంత్రం 5 గంటలకు ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియో సాంగును రిలీజ్ చేయనున్నారు.ఈ సినిమాలో మామ అల్లుళ్లుగా వెంకీ – చైతూ కనిపించనున్నారు. అందువలన రేపు వదలనున్న సాంగ్ ను కూడా మామా అల్లుళ్లకు అంకితం ఇస్తున్నట్టుగా చెప్పారు. తమన్ స్వరపరిచిన ఈ బాణీకి, రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా ఒక పోస్టర్ ను వదిలారు. కుటుంబాలు .. బంధాల విలువను చాటి చెబుతూ గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాను, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Leave a Response