హీరోగా రాణిస్తున్న సంగీత దర్శకుడు జీవీప్రకాష్ తన కెరీర్లో రెండోసారి హారర్ చిత్రంలో నటిస్తున్నాడు. జీవీ మొదటి చిత్రం ‘పెన్సిల్’ అయినప్పటికీ, ప్రేక్షకుల ముందుకు వచ్చింది మాత్రం ‘డార్లింగ్’. హారర్ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రం జీవీకి మంచి పేరు తీసుకొచ్చింది. ఇప్పుడు దర్శకుడు ఎళిల్ తెరకెక్కిస్తున్న ‘ఆయిరం జన్మంగళ్’లో జీవీ హీరోగా నటిస్తున్నాడు. ఇది కూడా హారర్ చిత్రమే. ఇందులో ఇషా రెబ్బా, నికిషా పటేల్, సాక్షి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సి. సత్య సంగీతం, యుకే సెంథిల్‌కుమార్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. అభిషేక్ ఫిలింస్ బ్యానర్‌పై రమేష్ పిళ్లై నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ క్లైమాక్స్‌కు చేరుకున్న తరుణంలో దసరా కానుకగా మంగళవారం ‘ఆయిరం జన్మంగళ్’ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.
previous article
రాజమౌళికి హీరోలు విషెస్..
next article
తెలుగు రాష్ట్రలో భారీ వర్షాలు..!