ఇక్కడ రూ.10 ఇస్తే చాలు రూ.460 ఫుల్ బాటిల్ మద్యం ఇచ్చేస్తారు. రూ.50 ఇచ్చారంటే రూ.600 మద్యం సీసా ఇస్తారు. ఇంతకంటే నాణ్యమైన మద్యం కావాలంటే రూ.100 ఇవ్వాలి అప్పుడు రూ.1000 మద్యం సీసా లభిస్తుంది. ఎన్నికల తేదీ దగ్గర పడటంతో కొందరు రాజకీయ నాయకులు మద్యం పంపిణీ చేపట్టేందుకు ఈ కొత్త పద్ధతిని ఎంచుకున్నారు. మాదాపూర్లోని సిటీ వైన్స్లో అతి చవగ్గా మద్యం లభిస్తోంది. అది కూడా ఎవరికి పడితే వారికి కాదు. ఇచ్చే నోటుకు సంబంధించిన సిరీస్ నెంబరు సరిపోలితేనే ఈ బంపర్ డిస్కౌంట్ వర్తిస్తుంది
previous article
ఆధార్ డేటా ఉపసంహరించుకొనే అవకాశం!
next article
అందేలా ఉంది.. అందుతుందా!
Related Posts
- /No Comment