ఆధార్‌ డేటా ఉపసంహరించుకొనే అవకాశం!

ప్రైవేటు సంస్థలు ఆధార్‌ డేటాను వినియోగించుకోవడం రాజ్యాంగ బద్ధం కాదని తీర్పు సందర్భంగా న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఆధార్‌ చట్టాన్ని సవరించే ప్రతిపాదనలపై ప్రభుత్వం తుది కసరత్తులు చేస్తోంది. దీని ప్రకారం తమ ఆధార్‌ సంఖ్య, బయోమెట్రిక్‌ వంటి ఇతర వివరాలను గతంలో ప్రైవేటు సంస్థలకు ఇచ్చిన పౌరులు ఆ వివరాలను వారి నుంచి ఉపసంహరించుకొనే వెసులుబాటుపై ప్రతిపాదన చేసింది. ‘‘సవరణలకు సంబంధించి ప్రాథమిక ప్రతిపాదనలను భారత విశిష్ట ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) రూపొందించింది. 18 ఏళ్ల వయసు దాటినవారికి అంతకుముందు ప్రైవేటు సంస్థలకు ఇచ్చిన ఆధార్‌ వివరాలను ఉపసంహరించుకొనేందుకు ఆరు నెలల సమయం ఇవ్వాలని యూఐడీఏఐ ప్రతిపాదించింది’’ అని ఓ సీనియర్‌ అధికారి తెలిపారు

Leave a Response