ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టు మూడు దేశాల జూనియర్ మహిళల హాకీ టైటిల్ సొంతం చేసుకున్నారు. హ్యాట్రిక్ విజయాలతో జోరుమీదున్న భారత్ తమ చివరి మ్యాచ్‌లో మాత్రం 1-2 గోల్స్‌తో ఆతిథ్య ఆస్ట్రేలియా చేతిలో ఓడి పోయారు. అయితే నాలుగు మ్యాచ్‌ల్లో 7 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి టీమిండియా ట్రోఫీ దక్కించుకుంది. ఆసీస్‌కూ ఏడు పాయింట్లే ఉన్నా, భారత్‌కంటే ఒక గోల్ తక్కువగా ఉండడంతో రెండోస్థానంలో నిలిచింది. న్యూజిలాండ్ మూడో స్థానంలో నిలిచింది. కాగా, తొలి మూడు మ్యాచ్‌ల్లో అదరగొట్టిన టీమిండియా ఆసీ్‌సతో పోరులో తేలిపోయింది. అబిగైల్ విల్సన్ రెండు గోల్స్‌తో ఆసీస్ జట్టును గెలిపించింది. భారత్ తరఫున గగన్‌దీ్‌ప కౌర్ ఏకైక గోల్ సాధించింది. టీమిండియా డిఫెన్స్ బలహీనంగా ఉండడంతో తొలి క్వార్టర్‌లో ఆసీస్ పలు మార్లు గోల్ పోస్ట్‌పై దాడులు చేసింది. 15వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ను అబిగైల్ గోల్‌గా మలచడంతో ఆసీస్ 1-0తో ఆధిక్యంలో వచ్చింది. రెండు, మూడు క్వార్టర్స్‌లో ఇరు జట్లు ఒక్క గోల్ కూడా నమోదు చేయలేకపోయాయి.
Tags:hockey
previous article
బాలకృష్ణ సరసన రష్మీ…
next article
మంగ్లీ ‘స్వేచ్ఛ’ చిత్రం…
Related Posts
- /
- /No Comment