టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జునకు ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో.. తమ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఓటర్లను చైతన్య పర్చాలంటూ ఈ ట్వీట్ ద్వారా మోదీ సూచించారు. గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో సినిమాల ద్వారా లక్షల మంది ఆధారాభిమానాలు సంపాదించారు. అలాగే పలు అవార్డులు సైతం సొంతం చేసుకున్నారు. చాలా ఎక్కువ మంది ఫాలోయింగ్ ఉన్న మీరు.. ఈ ఎన్నికల్లో ఎక్కువ సంఖ్యలో పోలింగ్ జరిగేలా ఓటర్లను చైతన్య పరచాలని విజ్ఞప్తి చేస్తున్నాను ఆయన పేర్కొన్నారు.
అయితే తాజాగా ప్రధాని చేసిన ఈ ట్వీట్‌పై స్పందించారు నాగార్జున. మేమంతా ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాం. అందరం ఖచ్చితంగా ఓటేస్తాం. నాపై నమ్మకముంచి మీరు పేర్కొన్న విషయం పట్ల ధన్యవాదాలు తెలుపుతున్నా అని రిప్లై ఇచ్చారు నాగ్