బయటకొస్తున్న జగన్‌ దుర్మార్గాలు: చంద్రబాబు

ప్రతిపక్ష నాయకుడు జగన్‌కు సంబంధించిన మరిన్ని దుర్మార్గాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. వైకాపా, భాజపా, తెరాస సంబంధం ఆధారాలతో సహా బయటపడిందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన పార్టీ నేతలతో మాట్లాడారు. తెలుగు దేశం పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను ఇవాళ ప్రకటించనున్నట్లు తెలిపారు. ఈ 26 రోజులూ రేయింబవళ్లు కష్టపడి పార్టీ అఖండ విజయానికి కృషి చేయాలని నేతలకు చంద్రబాబు సూచించారు.

Leave a Response