హైకోర్టులో చిరంజీవికి ఊరట

ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులో ప్రముఖ సినీనటుడు చిరంజీవికి ఊరట లభించింది. ఆయనపై దాఖలైన కేసును హైకోర్టు కొట్టివేసింది. 2014 ఏప్రిల్‌ 27న రాత్రి 10గంటలు దాటిన తరువాత ఎన్నికల ప్రచారం చేశారంటూ గతంలో గుంటూరు అరండల్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై దాఖలైన చార్జ్‌షీటును కిందికోర్టు పరిగణనలోకి తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ చిరంజీవి ఉమ్మడి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. బుధవారం దీనిపై న్యాయమూర్తి జస్టిస్‌ టి.రజని ముందు విచారణ జరిగింది. చిరంజీవి ప్రచారం ముగించుకుని తిరిగి వస్తుండగా అక్రమంగా కేసు బనాయించారని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. ఆ కేసును రద్దు చేస్తూ తీర్పు వెలువరించారు.

Leave a Response