ఫోన్ వాయిస్ రికార్డును మీడియా ముందు ప్రదర్శించిన మంత్రి ……….

టీడీపీ కార్యకర్తలకు వైసీపీ నేతలు ఫోన్లు చేసి మభ్యపెడుతున్నారని, ఒక్కో ఓటుకు రూ. 5వేలు అంటూ ప్రలోభ పెడుతున్నారని రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా ఓ టీడీపీ కార్యకర్తకు వచ్చిన ఫోన్‌ వాయిస్‌ రికార్డును మీడియా ముందు ప్రదర్శించారు. గొల్లపూడికి చెందిన శీను నాయక్‌ అనే కార్యకర్తకు వైసీపీ నేతల నుంచి ఫోన్‌ వచ్చిందన్నారు. ఇలా ప్రతిరోజు వేల మంది కార్యకర్తలకు వైసీపీ నేతలు ఫోన్లు చేసి డబ్బు ఆశ చూపుతున్నారని మంత్రి అన్నారు.

Leave a Response