అన్ని సినిమాలు నేనే చేయలేను కదా : మహేష్

మేజర్‌’ చిత్రంతో నిర్మాతగా మారారు సూపర్‌స్టార్ మహేశ్‌ బాబు. ఘట్టమనేని ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారాయన. ఇందులో అడివి శేష్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. కాగా.. ఈ సినిమా గురించి మహేశ్‌ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.  ‘మేజర్‌’ చిత్రాన్ని ఎందుకు తీయాలనుకున్నారు? అందులో ఆయన నటించకపోవడానికి కారణం ఏంటి? వంటి ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ‘నేను యాక్టివ్‌ నిర్మాతను కాను. నాకు సినిమాలంటే చాలా ఇష్టం. అవి ఏ జోనర్‌కు సంబంధించినవైనా సరే. కానీ ప్రేక్షకులకు చూపించి తీరాల్సిన కథలు కొన్నుంటాయి. అలాంటివాటిలో ‘మేజర్‌’ ఒకటి. ఈ సినిమాలో నేను నటించేవాడ్నే. కానీ అన్ని సినిమాల్లోనూ నేనే నటించలేను కదా? ‘మేజర్‌’ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అదీకాకుండా మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ గురించి శేష్‌ చాలా పరిశోధన చేశారు. ఈ పాత్రకు ఆయనే సరిపోతారనిపించింది’ అని వెల్లడించారు. ‘మహర్షి’ సినిమా గురించి మాట్లాడుతూ.. ‘ఈ సినిమా నా హృదయానికి బాగా దగ్గరైంది. మేమందరం చాలా కష్టపడుతున్నాం. నా కెరీర్‌లో మరో ల్యాండ్‌మార్క్‌ చిత్రంగా నిలిచిపోతుంది’ అన్నారు. ‘మహర్షి’ చిత్రం ఏప్రిల్‌ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

 

Leave a Response