తన వద్ద పీఏ వ్యవస్థ ఉండదని, అందరి ఫోన్ కాల్స్‌కు, మెసేజ్‌లకు తాను సమాధానం ఇస్తానని ఐటీ శాఖమంత్రి నారా లోకేశ్ అన్నారు. తాను పోటీచేసే నియోజకవర్గం మంగళగిరిలో మాట్లాడారు. కార్యకర్తలు, ప్రజలకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు. కొందరు నేతలు కులాల ప్రస్తావన తెస్తున్నారని, కొందరు రేపు మతాన్ని, ప్రాంతాన్ని కూడా తీసుకొస్తారని విమర్శించారు. మన కులం మంగళగిరి, మన మతం మంగళగిరి, మన ప్రాంతం మంగళగిరి అని అన్నారు. పార్లమెంటులో మోదీ పేరు ప్రస్తావించాలంటేనే చాలామంది భయపడతారని, అలాంటిది తెదేపా ఎంపీ గల్లా జయదేవ్ లోక్‌సభలో మిస్టర్ ప్రైమ్‌మినిస్టర్ అని మాట్లాడారని గుర్తుచేశారు. మచ్చలేని కుటుంబాలపై కుట్రలు పన్ని కేసులు పెడుతున్నారని లోకేశ్ ఆరోపించారు.
previous article
వివేకా మృతిపై స్పందించిన చంద్రబాబు
next article
మోదీ ట్వీట్‌పై నాగ్ స్పందన