నిజాం హయాంలో నిజాం పూచికత్తుతో పురుడు పోసుకొని కాలక్రమంలో తెలంగాణ ఆర్టీసీగా మారిన ఈ సంస్థ మనుగడ పై కీలక నిర్ణయాలు వెలువడనున్నాయి. ఐదువేల ప్రైవేటు బస్సులను ఆర్టీసీ రూట్లలో ప్రవేశపెట్టనున్నట్లు సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. హై కోర్టు కూడా రూట్ల ప్రైవేటీకరణ పై అభ్యంతరాలు లేవనెత్తటంతో నేడు జరిగే మంత్రి వర్గ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే కార్మికులను తిరిగి విధుల్లోకి చేర్చుకోమంటూ సీఎం కార్యాలయం ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ పేరుతో ప్రకటన విడుదల చేసింది. 10 నుండి 12 రోజుల్లో పీఆర్సీ నివేదిక ఇవ్వాలని ఈ నెల 10వ తేదీన సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ గడువు ఈ నెల 22వ తేదీన ముగిసింది. వాస్తవానికి అదే రోజు నివేదిక తెప్పించుకొని ఒక కమిటీ వేసి నివేదికపై అధ్యయనం చేస్తారని ప్రచారం జరిగింది. వచ్చే ఏడాది బడ్జెట్ లోనే ఫిట్ మెంట్ పై కీలక నిర్ణయం తీసుకుంటారని ఏప్రిల్ 1 నుంచి కొత్త వేతనాలు ఆదుకుంటారని తెలుస్తుంది. దీని పై ఉద్యోగ సంఘాల కు కీలక సంకేతాలందాయి.వేతన సవరణపై ఆశలు ఏవీ లేవని ఏప్రిల్ దాకా ఆగాల్సి ఉంటుందని కీలక నేత ఒకరు తమ సంఘం ప్రతినిధులకు సమాచారం అందించారు. దాంతో వేతన సవరణ పై తమకెలాంటి ఆశల్లేవుని ,వచ్చే బడ్జెట్ తర్వాతే జీతాల పెంపు ఉండొచ్చు అని ఉద్యోగ జేఏసీ కీలక ప్రతి నిధి ఒకరు తమ ప్రతినిధులకు స్పష్టం చేశారు. ప్రస్తుతం టిఆర్ ఎస్ బలం కాంగ్రెస్ నుంచి చేరిన వారితో కలిపి 103గా ఉంది. కానీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 ప్రకారం 17 మందికి మాత్రమే మంత్రి వర్గంలో చోటు కల్పించేలా పరిమితి ఉంది. దీంతో ఎమ్మెల్యేల్లో చాలా మంది మంత్రులు అవుతారని ప్రచారం జరిగినా, చట్ట పరిమితి వల్ల అవకాశం దొరకలేదు. ముగ్గురు మంత్రులకు ఉద్వాసన పలికి ఆ స్థానంలో కొత్త వారికి చాన్స్ ఇస్తారని ప్రచారం జరిగినా అది కుదరలేదు.
Tags:cabinate assemblykcrtsrtctsrtc strike
previous article
చంద్రబాబు కాన్వాయ్ పైకి రాళ్లు, చెప్పులు…
next article
బీజేపీ ప్రభుత్వం కూలిపోయే అవకాశం…