మాజీ ఐ.ఏ.ఎస్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ నెల ఏడు వరకు సిట్ ఫిర్యాదులు స్వీకరించనుంది. ఆన్ లైన్ లోనూ అధికారులు ఫిర్యాదులు స్వీకరించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విశాఖ భూ కుంభకోణాలు మీద సిట్ విచారణ ప్రారంభించింది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ విచారణ అనేది కేవలం అధికార పార్టీని రక్షించే విధంగా ఉండటంతోటి ఇక్కడ ప్రతిపక్షాల నుంచి ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు మరొకసారి ఈ రాష్ట్ర ప్రభుత్వం సిట్ విచారణ ఏర్పాటు చేయడం జరిగింది.భూ కుంభకోణాలు జరిగాయని ఒక ఆరోపణ వినిపిస్తున్న నేపథ్యంలో విశాఖపట్నం సిటీలో దాదాపుగా పదమూడు మండలాలకు సంబంధించిన ఫిర్యాదులను సిట్ స్వీకరించబోతుంది.రెండేసి మండలాలకు సంబంధించి ఒక హెల్ప్ డెస్క్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ హెల్ప్ డెస్క్ లో మొట్టమొదటగా ఎవరైనా బయటి నుంచి ఫిర్యాదు చేయటానికి వచ్చే వారి కోసం ఎక్కడికి వెళ్లాలి, ఏ మండలానికి ఏ టేబుళ్లను ఏర్పాటు చేయటం జరిగింది అని తెలియ చెప్పటం కోసం ప్రత్యేకంగా ఆరు టేబుల్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది. సిరిపురం వుడా చిల్డ్రన్ అరీనా వద్ద అధికారులు ఫిర్యాదులు స్వీకరించనున్నారు. మాజీ ఐ.ఏ.ఎస్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ నెల ఏడు వరకు సిట్ ఫిర్యాదులు స్వీకరించనుంది. ఆన్ లైన్ లోనూ అధికారులు ఫిర్యాదులు స్వీకరించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విశాఖ భూ కుంభకోణాలు మీద సిట్ విచారణ ప్రారంభించింది.