ప్రేక్షకులకు కొత్తదనంతో కూడిన సినిమాలు అందించాలనే తాపత్రయంలో హీరోలు రిస్కులకు వెనుకాడరు.రవితేజ కూడా అటువంటి ఓ రిస్క్ చేశారు. ప్రమాదం నుండి బయటపడ్డారు. విఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటిస్తున్న సినిమా ‘డిస్కో రాజా’. ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఐస్ క్యాప్ లలో రెండోదైన గ్లాసియర్ లాంగ్జొకుల్ లో ఈ సినిమా కోసం ఒక ఫైట్ తీశారు. రోజూ హోటల్ నుండి నాలుగు గంటలు ప్రయాణిస్తే తప్ప ఆ ఐస్ క్యాప్ కి చేరుకోలేరు. ఒకరోజు ఐస్ క్యాప్ మీద కారులో వెళుతున్నప్పుడు మంచు కరగడంతో మంచులో కారు టైర్లు కూరుకుపోయాయి. మళ్ళీ ట్రాక్ మీదకు కారును తీసుకురావడానికి కష్టాలు పడ్డారట. ఒకవేళ మంచు మరింత కరిగితే పెద్ద ప్రమాదం ఎదురయ్యేది. అదృష్టం బావుండి, ప్రమాదం తప్పింది. అంత కష్టపడి షూటింగ్ చేసిన విజువల్స్ చాలా బాగా వచ్చాయని దర్శకుడు విఐ ఆనంద్ హ్యాపీగా ఉన్నారు. ఈ సినిమా డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది.
Tags:Disco Rajaravi teja
previous article
ఏంటి ఆ డబ్బింగ్?- నాని వైఫ్ అంజనా
next article
ఒక రాయి వేస్తే మేం తోపులు అనుకుంటారు..!