యూటర్న్ చంద్రబాబు మరోసారి యూటర్న్ తీసుకున్నారని మంత్రి పేర్ని నాని సెటైర్లు వేశారు.చంద్రబాబు సొంత పుత్రుడు నారా లోకేష్ దత్త పుత్రుడు పవన్ కల్యాణ్ కూడా మాట మార్చడం అలవాటైపోయిందని పేర్నినాని నిప్పులు చెరిగారు. ఇంగ్లీష్ మీడియం అమలుకు తాము ప్రయత్నిస్తే ఆనాడు ప్రతిపక్ష నేతగా జగన్ అడ్డుకున్నారని చంద్రబాబు చెప్పడం సరికాదన్నారు. ఇప్పటివరకు ఇంగ్లీష్ మీడియం వద్దే వద్దన్న బాబు ఇప్పుడు ఆంగ్ల మాధ్యమానికి తాము వ్యతిరేకం కాదని, కానీ తెలుగు కూడా ఉండాలనడం యూటర్నే అన్నారు పేర్ని నాని. జగన్ను రాజకీయంగా ఎదుర్కోలేక మతం పేరుతో చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. సెక్యులర్ పార్టీ అని చెప్పుకుంటూ మత రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు కంటే బీజేపీ, శివసేన, ఎంఐఎమ్మే బెటర్ అన్నారు. తెలుగుదేశం సెక్యులర్ పార్టీ అని చెప్పుకుంటూ మత రాజకీయాలు చేయడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. బీజేపీ నేత సుజనాచౌదరిపై మంత్రి పేర్ని నాని నిప్పులు చెరిగారు. బీజేపీ వాళ్లకు ఎప్పుడు అర్ధమవుతుందో ఆ దేవుడికే తెలియాలన్నారు. సుజనాచౌదరి రోజూ చంద్రబాబుతో మాట్లాడకపోతే కాల్ డేటాను మీడియా ఇవ్వాలని పేర్ని నాని సవాలు చేశారు.
- /
- /admin
- /No Comment
- /11 views
- /nara lokeshnarachandrababu naidupawan kalyanperni nanisujana chowdary
బాబు, లోకేష్, పవన్, సుజనాపై నిప్పులు చెరిగిన పేర్ని నాని…
previous article
గంజాయి మత్తులో విద్యార్థులు…
next article
న్యూ మూవీ టైటిల్ పై కసరత్తు