గంజాయి మత్తులో విద్యార్థులు…

ఏజెన్సీ కేంద్రంగా గంజాయి అక్రమ రవాణా జరుగుతుందని అందరికీ తెలిసిన విషయమే. ఒక పక్క పోలీసులు, మరో పక్క ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ పోలీసులు ఎన్ని దాడులు చేసినప్పటికి లాభం లేకుండా పోతుంది. గంజాయి పట్టకున్నట్లు ప్రతి రోజు వార్తలు వస్తున్నాయి. అక్రమ రవాణా చేస్తూ పోలీసులకు దొరికిన వారు జైల్లో మగ్గుతున్నారు.ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి సాగు గంజాయి ఇతర రాష్ట్రాలకు అక్రమ రవాణా అనేది లాభదాయకమైన వ్యాపారం. అందుకే గంజాయి అక్రమ రవాణాకు అక్రమార్కులు వివిధ పద్ధతులను వాడుకుంటున్నారు. చివరకు విద్యార్థులకు పాకెట్ మనీ ఆశ చూపి విద్యార్థులతో గంజాయి అక్రమ రవాణా చేయిస్తున్నట్టు ఇటీవల పోలీసుల దాడుల్లో బయటపడింది. ఇది తెలిసిన పోలీసులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రస్తుతం యూత్ ఎంజాయ్ లైఫ్ కు అలవాటు పడిపోయారు. కాలేజ్ కు వెళ్తున్న విద్యార్థులకు ఇంట్లో ఇచ్చిన పాకెట్ మనీ సరిపోకపోవడంతో అడ్డదారులు తొక్కుతున్నారు.విద్యార్థులంతా ఒక చోట చేరుకొని సిగరెట్, కాఫీ, కూల్ డ్రింగ్ తాగుతూ చర్చలు పెట్టుకుంటారు. అక్కడితో ఆగకుండా వీకెండ్ అంటూ ప్రత్యేక పార్టీలు, లాంగ్ డ్రైవ్ ప్లాన్ చేసుకుంటారు. ఒక పక్క బిజీ లైఫ్ తో పాటు మరో పక్క ఎంజాయ్ మెంట్ ను కోరుకోవడంతో విద్యార్థులు అక్రమార్కుల చేతిలో అడ్డంగా బలవుతున్నారు. ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో 12 మంది విద్యార్థులు ముక్లబ్ ఏజెన్సీ నుంచి గంజాయి తెస్తున్నట్టు టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారమందింది. దీంతో ఆ విషయం విద్యార్థులకు తెలిసిపోవడంతో గంజాయిని దారిలోనే పడేసి జాగ్రత్త పడ్డారు. పోలీసులకు పక్కా సమాచారంతో వారిని అదుపులోకి తీసుకొని విచారించగా గంజాయిని మార్గమధ్యంలోనే వదిలేసినట్టు పోలీసుల ముందు ఒప్పుకున్నారు. ఇదే విధంగా ఆరిలోవ పరిధిలో ఇంజనీరింగ్ డిస్ కంటిన్యూ చేస్తున్న ముగ్గురు విద్యార్థులు ఏజెన్సీ నుంచి గంజాయి తీసుకొచ్చి విద్యార్థులకు విక్రయిస్తూ పట్టుబట్టారు. ఇక తాజాగా ఒక ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు సాగర్ లో గంజాయి సేవిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు.

Tags:ganjaistudents

Leave a Response