జగన్ ఐదు నెలల్లో…

వెల్లంపల్లి శ్రీనివాస్ చంద్రబాబు అన్ని టెంపరరీ పనులు చేశారని, జగన్ శాశ్వత కట్టడాల కోసం ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు అవలంబించిన విధానాల వల్లే రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారన్నారు. రాజధానిలో అడుగు పెట్టాలంటే క్షమించండని రైతుల్ని బాబు వేడుకోవాలి అంటున్నారు. లక్షా తొమ్మిది వేల కోట్లు రాజధానికి కావాలని చెప్పి నాలుగు వేల కోట్లతో టెంపరరీగా అసెంబ్లీలు, సెక్రటేరియట్లు, హైకోర్టులు కట్టిన వ్యక్తి చంద్రబాబే. తాను చేయగలిగిందే చెబుతాడని, చెప్పాలనే అభిప్రాయంతో ముందుకెళ్తున్న సమయంలో వచ్చి ఐదు నెలల్లో జగన్ ఏమి చేయలేదని అనడం సమంజసం కాదన్నారు. చంద్రబాబు యాత్రలో కొందరు రైతులు చంద్రబాబునాయడుని రావద్దని చెప్పి నినాదాలు చేశారని వెల్లడించారు. రైతులు తమకు ఎంతో మేలు జరుగుతుందని ఇచ్చిన భూములకు తగిన న్యాయం జరగలేదని అన్నారు. ఏమాత్రం అభివృద్ధి చేయకుండా సిగ్గు శరం లేకుండా ఇవాళ పర్యటణ చేపట్టారని చంద్రబాబు పై తీవ్రంగా మండిపడ్డారు.అమరావతికి వెళ్లి చంద్రబాబు ఏం పరిశిలిస్తారని ఆయన మండిపడ్డారు. రైతులు ధారాదత్తం ఇచ్చిన భూముల్లో ప్రైవేటు కాలేజీల నుంచి కట్టబేడుతున్నారని సభలో హైకోర్టు గురించి ప్రస్తావిస్తే కానీ హైకోర్టు కట్టడం గురించి ఆలోచించలేదన్నారు.

Tags:chandrababu naidujagan mohan reddyvellampalli srinivas

Leave a Response