నినాదంతో కార్మిక వర్గాలను ఏకం చేసే పనిలో సక్సెస్ అయ్యారు నలుగురు. ఉద్యోగ సంఘాల నాయకులైన స్వామిగౌడ్, దేవీ ప్రసాద్, శ్రీనివాసగౌడ్ ,విఠల్ లు ముందుండి సకల జనుల సమ్మెతో యావత్ సమాజాన్ని ఏకం చేశారు. ఆ సమ్మెతోనే ఉద్యమానికి ఊపిరి వచ్చిందని చెప్పుకోవాలి. అప్పట్లో ఆర్టీసీ చక్రాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ఇలా అన్ని వర్గాలనూ ఉద్యమంలో నడిపించారు ఉద్యోగ సంఘాల నేతలు. అయితే ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల సమ్మె 53 రోజులు జరిగినా ఉద్యమంలో కలిసి పని చేసిన ఉద్యోగ సంఘాలు అంతగా సహకరించిన దాఖలాలు లేవన్నది కాంగ్రెస్ వాదన. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఇతర సంఘాల నేతలు ఒకటి రెండు రోజులు మద్దతిచ్చారు. ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. అప్పట్లో అన్ని వర్గాల నుండి ఒత్తిడి రావడం తోనే ఆ మాత్రం మద్దతిచ్చారని విమర్శలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించుకుని ఉద్యోగాల్లో చేరతామన్నా కూడా చేర్చుకునేది లేదని స్పష్టం చేసింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నాయకుల పై దాడి మొదలుపెట్టింది కాంగ్రెస్.ప్రభుత్వం ఇప్పుడు ఆర్టీసీ కార్మి కుల సమ్మెపై వ్యవహరిస్తున్న తీరుతో భవిష్యత్ లో ఏ ఉద్యోగ సంఘమైనా సమ్మె అంటే ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది.