కర్ణాటకలో బీజేపీకి షాకే తగిలే అవకాశముందని తెలుస్తోంది. ప్రమాణస్వీకారం చేసిన మూడు రోజులకే బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 104 సీట్లు గెలిచినా అధికారం చేపట్టడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ మాత్రం దాటలేదు. కాంగ్రెస్-జేడీఎస్ లకు చెందిన 17మంది ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి, సంకీర్ణ ప్రభుత్వానికి అసెంబ్లీలో మెజారిటీ లేకుండా చేసింది. కాంగ్రెస్-జేడీఎస్ లకు చెందిన 17 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో బీజేపీకి మెజారిటీ సరిపోయింది. ఇప్పుడు బీజేపీకి ఉపఎన్నికలు కీలకం కానున్నాయి. డిసెంబర్ 5 న కర్ణాటకలో 15 స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు డిసెంబర్ 9 న తేలనున్నాయి. ఉపఎన్నికల్లో కనీసం 7 స్థానాలు గెలిస్తేనే బీజేపీ సర్కార్ సేఫ్‌జోన్ లో ఉంటుంది. ఉపఎన్నికల్లో సత్తాచాటి బీజేపీకి షాక్ ఇవ్వాలని కాంగ్రెస్-జేడీఎస్ దృఢనిశ్చయంతో ఉన్నాయి. ఉపఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఫలితాలు వస్తే డి.కె.శివకుమార్‌ను సీఎం చేస్తే మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే దేవేగౌడ కాంగ్రెస్ పార్టీకి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. యడియూరప్ప సీఎంగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కూడా కూలిపోయే అవకాశం కనిపిస్తోంది.
Tags:bjp partykarnataka
previous article
ఆర్టీసీ భవిష్యత్తు…
next article
జగన్ ఐదు నెలల్లో…
Related Posts
- /
- /No Comment