హల్ చల్ చేస్తున్న మజిలీ వీడియో సాంగ్…..

వెండి తెరపై మోస్ట్ లవింగ్ కపుల్ అంటే మన అక్కినేని నాగచైతన్య-సమంత. పెళ్లి తరువాత వాళ్ళు నటిస్తున్న మొట్టమొదటి సినిమా ‘మజిలీ’! ఇప్పటికే ఈ సినిమా పై ఇండస్టీలో టాక్ మారుమోగుతోంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 5న అభిమానుల ముందు పెట్టాలని ఈ సినిమా దర్శకుడు అనుకున్నాడు. ఈ సినిమాలో ప్రమోషన్‌లో భాగంగా ‘మజిలీ’కి సంబంధించి ఒక సాంగ్ మేకింగ్ వీడియో ఒకటి ఎప్పుడు హల్ చల్
చేస్తుంది. చైతన్య ప్రసాద్ రాసిన లిరిక్స్‌కి గోపి సుందర్ ట్యూన్స్ కడితే.. సింగర్ చిన్మయి అద్భుతంగా పాడింది. లవ్ అండ్ ఎమోషన్స్‌ని నూటికి నూరుశాతం పండించే క్రమంలో ఈ పాట బ్యాక్ డ్రాప్ సీన్స్ అన్నిటినీ టచ్చింగ్‌గా లైనప్ చేశాడు డైరెక్టర్ శివ నిర్వాణ. పాటతో పాటు సినిమా మేకింగ్ విశేషాల్ని సమంత, చైతూ, శివ నిర్వాణ వివరిస్తూ సాగిన ఈ వీడియో.. ‘మజిలీ’ ఒరిజినల్ స్ట్రెంత్‌ని అభిమానులకి పరిచయం చేస్తోంది. ఇక రేవు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్లు రాబడుతుందేమో చూడాలి.

.

Leave a Response