అక్కినేని నాగార్జున కథానాయకుడిగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ‘మన్మథుడు 2’ రూపొందనుంది. ఈ నెలాఖరులో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం రకుల్ ని సంప్రదిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. ముందుగా ‘వెంకీమామ’ సినిమాలో చైతూ జోడీగా ఎంపికైన రకుల్, ‘మన్మథుడు 2’ కోసం ఆ సినిమాను వదిలేసుకుందనే టాక్ వచ్చింది.అయితే ఆ తరువాత ‘మన్మథుడు 2’ సినిమా కోసం ఆమెను తీసుకున్నారా లేదా అనే విషయంలో క్లారిటీ రాలేదు. ఈ సినిమాలో కథానాయికగా ఆమెనే ఖరారు చేశారనేది తాజా సమాచారం. ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా చలాకీగా .. బిందాస్ గా ఉంటుందని చెప్పుకుంటున్నారు. కొత్తగా డిజైన్ చేసిన ఈ పాత్ర తనకి మరింత క్రేజ్ తీసుకొస్తుందనే గట్టి నమ్మకంతో రకుల్ ఉందని అంటున్నారు.
previous article
రాజమౌళి సినిమా తరువాత మరో ప్రాజెక్టును లైన్లో పెట్టేసిన చరణ్
next article
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను బాలకృష్ణకు అంకితం..!
Related Posts
- /No Comment