అల్లు అర్జున్‌లాంటి వ్యక్తి భర్తగా రావాలి అంటుంది మలయాళీ బ్యూటీ…

స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ లాంటి వ్యక్తి తనకు భర్తగా రావాలని అంటున్నారు ప్రముఖ మలయాళీ నటి నూరిన్‌ షరీఫ్‌. ఇటీవల విడుదలైన ‘లవర్స్‌ డే’ (మలయాళంలో ఒరు అడార్ లవ్‌) చిత్రంలో ఆమె ప్రియా ప్రకాశ్‌ వారియర్‌తో పాటు మరో కథానాయికగా నటించారు. కొద్దిరోజులుగా నూరిన్‌ హైదరాబాద్‌లో ఈ సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకకు అల్లు అర్జున్‌ అతిథిగా హాజరవడం గురించి, తనకు బన్నీ పట్ల ఉన్న అభిమానం గురించి నూరిన్‌ తాజాగా ఇచ్చిన‌ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘చిన్నప్పటినుంచి నాకు అల్లు అర్జున్‌ అంటే చాలా ఇష్టం. ఆయన సినిమాలు మలయాళంలోనూ విడుదలవుతాయి. ఆయన నటించిన చాలా సినిమాలు చూశాను. పెళ్లంటూ చేసుకుంటే అల్లు అర్జున్‌లాంటి వ్యక్తినే చేసుకోవాలని అనుకునేదాన్ని. ‘లవర్స్‌ డే’ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేయడం నేను జీవితంలో మర్చిపోలేను. ఈవెంట్‌లో అర్జున్‌ సర్‌ను కలిసి మాట్లాడుతున్నప్పుడు ఎవరో మా ఫొటో తీశారు. అయితే ఆ ఫొటో తీసిన ఫొటోగ్రాఫర్‌ ఎవరో నాకు తెలీదు. అప్పటినుంచి ఆ ఫొటో ఎక్కడైనా దొరుకుతుందేమోనని తెగ వెతుకున్నాను. నాకు ఇప్పుడు తెలుగులోనూ అవకాశాలు వస్తున్నాయి’ అని వెల్లడించారు నూరిన్. ‘లవర్స్‌ డే’ చిత్రంలో ప్రధాన కథానాయిక నూరినే. కానీ ఎప్పుడైతే ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ కన్నుగీటిన సన్నివేశం వైరల్‌ అయిందో నూరిన్‌ పాత్ర నిడివి తగ్గించేశారు. ఈ విషయాన్ని నూరిన్‌ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అది తనను చాలా బాధించిందని, మున్ముందు ప్రియా ప్రకాశ్‌తో నటించాల్సి వస్తే ఆచి తూచి నిర్ణయం తీసుకుంటానని తెలిపింది ఆ ముద్దుగుమ్మ.

Leave a Response