గ్రేటర్ మేయర్ అభ్యర్థి జనరల్ మహిళకు స్థానం రిజర్వు కావడంతో అదృష్టం వరించే ఆ మహిళామణి ఎవరన్న దానిపై చర్చ జోరుగా సాగుతోంది.గ్రేటర్ ఎన్నికల్లో ఫలితాలు ఏకపక్షంగా రాకపోవడంతో.. టిఆర్‌ఎస్ బీజేపీ వ్యూహం ఏంటి అని ఆలోచిస్తున్నారు గ్రేటర్ ప్రజలు.మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు ఈ నెల 11 ఎన్నికలు జరుగనున్నాయి.అనంతరం కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం చేయనున్నారు.గ్రేటర్ ఎన్నికల్లో సంపూర్ణ మెజార్టీ అధికార పార్టీకి దక్కకపోయినా అతిపెద్ద పార్టీగా అవతరించింది. టిఆర్‌ఎస్ 56 స్థానాల్లో విజయం సాధించగా.. బీజేపీ 48, ఎంఐఎం 44, కాంగ్రెస్ 2 స్థానాల్లో గెలుపొందాయి. మేయర్ అభ్యర్థి ఎవరన్న దానిని సీల్డ్ కవర్లో వెల్లడిస్తామని.. సీఎం కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు.
బీజేపీ,ఎంఐఎం పార్టీలు పోటీ పడే అవకాశం దాదాపు లేదన్న అంచనాలో టీఆర్‌ఎస్ ఉంది.గురువారం జరిగే ఎన్నికల వ్యూహంపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాదాపు కసరత్తు పూర్తి చేశారు.మేయర్ స్థానం కైవసం చేసుకునేందుకు విపక్ష పార్టీలకు అవసరమైన బలం లేకపోవడం కూడా తమకు కలిసి వస్తుందని గులాబీ నేతలంటున్నారు.