కోలీవుడ్ స్టార్ హీరో ఇంటికి కొంత మంది బీజేపీ కార్యకర్తలు కాషాయ వస్త్రాలన పంపండం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. వివరాల్లోకెళ్తే తమిళ హీరో విజయ్ ఇంటికి తిరుపూర్‌కి చెందిన బీజేపీ కార్యకర్తలు కాషాయ వస్త్రాలు పంపారు. ఇటీవల ఓ సినీ వేడుకలో పాల్గొన్న ఆయన బీజేపీని పరోక్షంగా విమర్శించారు. సినిమాను పైరసీదారుల నుండి ఎం.జి.ఆర్ మాత్రమే కాపాడగలరు అన్నారు. పైరసీదారులకు రాజకీయవాదులే అండగా నిలబడుతున్నారు. ఎన్నికల రిజల్ట్ తర్వాత మనం కాషాయ వస్త్రాలు చుట్టుకుని తిరగాల్సిన పరిస్థితి అంటూ పరోక్షంగా బీజేపీ విమర్శలు చేశారు. దాంతో తిరుపూర్‌కు చెందిన బీజేపీ యువ విభాగం విజయ్ ఇంటికి కాషాయ వస్త్రాలను పంపింది. ఇప్పుడు మొదటిసారి కాషాయ వస్త్రాలను పంపుతున్నాం. ఇకపై ఇంకా పంపుతాం. ఎందుకంటే మీరు కాషాయ వస్త్రాలను కట్టుకుని తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ ఓ లేఖను కూడా రాశారు.
previous article
నిర్మాతగా 2 సినిమా… ఆ సినిమా ఎవరితో తెలుస్తే షాక్…?
next article
ANR సినిమా తో ప్రేమకథ..
Related Posts
- /No Comment