ముఖ్య అతిధిగా వెంకీ…?

వరుసగా సినిమాలు చేస్తున్నాడు మన నాని. ప్రస్తుతం నాని నటిస్తున్న సినిమా జెర్సీ. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాని క్రికెటర్ గా అభిమానులకు కనిపించనున్నాడు. ఆయనకు జోడి గా శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తుంది. ఈ నెల 19వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో తేరాకెక్కనుంది. ఈ నెల 15వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు దర్శకుడు. హైదరాబాద్ – శిల్పకళావేదికలో ఈ వేడుక జరగనుంది. ఆ రోజు రాత్రి 7గంటల 30 నిమిషాలకి ఈ కార్యక్రమం మొదలవుతుంది. ఈ వేడుకకి ముఖ్యఅతిథిగా వెంకటేశ్ రానున్నట్టుగా టాలీవుడ్ టాక్. స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు ఈ సినిమా యూనిట్.

Leave a Response