శర్వా చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలున్నాయి. డైరెక్టర్ సుధీర్ వర్మ సినిమాను ఇప్పటికే పూర్తి చేసిన శర్వా.. `96` రీమేక్ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. సుధీర్ వర్మ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయిపోయింది. ఈ నెలాఖరున అభిమానుల ముందుకు వస్తుంది. అయితే స్కూళ్ల ఓపెనింగ్ తదితర కారణాల వల్ల జూలైకు వాయిదా వేశారు.
ఈ సినిమాను టైటిల్ సమస్య వెంటాడుతోంది. ఈ సినిమాకు మొదట్నుంచి `దళపతి` టైటిల్నే అనుకున్నారట. అయితే వేరొకరు ఈ టైటిల్ను రిజిస్టర్ చేయించడంతో వీరికి ఇబ్బంది ఎదురైంది. దీంతో వేరే టైటిళ్లు ఆలోచించారు. `రణరంగం`, `వ్యూహం` ఇలా పలు టైటిళ్లు గురించి చర్చించుకున్నారట. అయితే ఈ కథకు `దళపతి` టైటిల్ అయితేనే బాగుంటుందని అనుకుంటున్నారట.