కెన్యాలో పరిచయగీతం

విజయ్‌సేతుపతి, త్రిష జంటగా తమిళంలో రూపొందిన 96 చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్‌గా పెద్ద విజయాన్ని సాధించింది. ఓ ఫొటోగ్రాఫర్ తన ప్రేమ జ్ఞాపకాల్ని అన్వేషిస్తూ సాగించే ప్రయాణం నేపథ్యంలో దర్శకుడు ప్రేమ్‌కుమార్ హృద్యంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రాన్ని నిర్మాత దిల్‌రాజు తెలుగులో రీమేక్ చేస్తున్నారు. మాతృకను తెరకెక్కించిన ప్రేమ్‌కుమార్ ఈ రీమేక్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. శర్వానంద్, సమంత నాయకానాయికలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ కెన్యాలో జరుగుతున్నది. హీరో శర్వానంద్ పరిచయ గీతాన్ని చిత్రీకరిస్తున్నారు. తదుపరి షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో తెరకెక్కించనున్నారు. త్వరలో తెలుగు టైటిల్‌ను వెల్లడించనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి రచన: మిర్చికిరణ్, సంగీతం: గోవింద్‌వసంత, కెమెరా: జె.మహేంద్రన్.

Leave a Response