రాజమౌళిని చూసి కాఫీ కొడుతున్న మణిరత్నం..?

మణిరత్నం ఇప్పుడు పొన్నియ‌న్ సెల్వం న‌వ‌ల‌ను సినిమాగా అభిమానుల ముందుకు తెచ్చే ప‌నిలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అమితాబ్ బ‌చ్చ‌న్‌, మోహ‌న్‌బాబు, విక్ర‌మ్‌, ఐశ్వ‌ర్యారాయ్‌, జ‌యం ర‌వి, విజ‌య్ సేతుప‌తి, అనుష్క‌, కీర్తిసురేష్, అమ‌లాపాల్‌ త‌దిత‌రులు కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమా కోసం మ‌ణిర‌త్నం `బాహుబ‌లి` స్టైల్‌ను ఫాలో కావాల‌ని అనుకుంటున్నాడ‌ట‌. `బాహుబ‌లి`ని రెండు భాగాలుగా చిత్రీక‌రించిన సంగ‌తి తెలిసిందే. అదే త‌ర‌హాలో పొన్నియ‌న్ సెల్వ‌న్ న‌వ‌లాధారంగా రూపొంద‌బోయే చిత్రాన్ని కూడా మ‌ణిర‌త్నం రెండు భాగాలుగా చిత్రీక‌రించే ఆలోచ‌న‌లో ఉన్నారు. ఈ ఏడాది చివ‌ర్లో సినిమా షూటింగ్ ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశాలున్నాయి.Image result for mani ratnam

Leave a Response