మెగా హీరో సాయిధరమ్ తేజ్ ఒక విజయాన్ని అందుకున్నాడు. `సుప్రీమ్` తర్వాత సాయిధరమ్ నటించిన ఆరు సినిమాలూ పరాజయాలుగానే నిలిచిన సంగతి మన అందరికి తెలిసిందే. కిశోర్ తిరుమల దర్శకత్వంలో సాయిధరమ్ నటించిన `చిత్రలహరి` ఇటీవల విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. సాయిధరమ్ నటన బాగుందని ప్రశంసలు కూడా లభించాయి. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వరుస పరాజయాల గురించి సాయిధరమ్ మాట్లాడాడు. ‘నా వరుస పరాజయాలకు కారణాలు వెతకాలనుకోవడం లేదు. ఆ సినిమాల విషయాంలో నిర్ణయాలు తీసుకున్నది నేనే. కాబట్టి తప్పు నాదే అవుతుంది. `ఇంటెలిజెంట్` సినిమా తర్వాత వినాయక్ నాకు సారీ చెప్పారు. నాకు హిట్ సినిమా ఇవ్వలేకపోయానని బాధపడ్డారు. ఇతర సినిమాల దర్శకులు కూడా అలాగే అన్నార`ని సాయిధరమ్ చెప్పడం విశేషం.
previous article
సినిమా చాలా బాగుందని ట్విట్టర్ లో పోస్టులు…?
next article
‘అయోగ్య’ ట్రైలర్…?