‘అయోగ్య’ ట్రైలర్…?

‘టెంపర్’ మాస్ ఆడియన్స్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ అయింది. దాంతో ఈ సినిమాను హిందీలోకి రీమేక్ చేయగా అక్కడ కూడా భారీ వసూళ్లను రాబట్టింది. ఇక తమిళంలో విశాల్ హీరోగా ఈ సినిమా ‘అయోగ్య’ పేరుతో రీమేక్ అయింది. వెంకట్ మోహన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ ను వదిలారు, లవ్ .. రొమాన్స్ .. యాక్షన్ సీన్స్ పై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. హీరో పాత్రలోని వేరియేషన్స్ ను ఈ ట్రైలర్ ద్వారా ఆవిష్కరించారు. రాశి ఖన్నా కథానాయికగా నటించిన ఈ సినిమాలో, పార్తీబన్ కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. వచ్చేనెలలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. తమిళంలోనూ ఈ సినిమా భారీ హిట్ కొడుతుందనే నమ్మకంతో విశాల్ వున్నాడు.

 

 

 

 

Leave a Response