టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సినిమా భారతీయ సినీ పరిశ్రమ స్థాయిని అత్యున్నత శిఖరాలకు చేర్చిన సంగతి తెలిసిందే. ‘బాహుబలి’ తొలి భాగం విడుదలైన తర్వాత… ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?’ అనే ప్రశ్న దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సాక్షాత్తు పార్లమెంటులో కూడా ఇదే అంశాన్ని ఒక ఎంపీ సరదాగా వ్యాఖ్యానించారు. తాజాగా ఇదే అంశంపై బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ స్పందించాడు. ప్రస్తుతం తన చిత్రం ‘భారత్’ ప్రమోషన్ కార్యక్రమాల్లో సల్లూ భాయ్ బిజీగా ఉన్నాడు. ఇందులో భాగంగా ఆయన మీడియాతో సమావేశమయ్యాడు. ఈ సందర్భంగా ఓ మీడియా ప్రతినిధి మాట్లాడుతూ, మీరు ‘బాహుబలి’ చిత్రాలు చూశారా? అని ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా తాను మొదటి భాగాన్ని మాత్రమే చూశానని… రెండో భాగాన్ని చూడలేదని సల్మాన్ సమాధానమిచ్చాడు. అందుకే బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తనకు ఇప్పటికీ అర్థం కావడం లేదని తెలిపాడు. రెండో భాగంలో ఏం జరిగిందో కూడా తనకు తెలియదని అన్నాడు.
previous article
‘గుణ 369’ నుంచి ఫస్టులుక్..
Related Posts
- /No Comment
దేవుడి దర్శనం …. నాని ప్రసన్నం
- /No Comment