ఎన్నికల్లో ఓడిపోయిన పవన్ కల్యాణ్.. సినిమా పై ద్రుష్టి

టాలీవుడ్ హీరో, జనసేన పార్టీని స్థాపించి, గడచిన ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని పొందిన పవన్ కల్యాణ్ తిరిగి ఓ సినిమా చేయనున్నాడని నిన్న వచ్చిన వార్తలు అవాస్తవమే. పవన్ హీరోగా, బండ్ల గణేశ్ ఓ భారీ సినిమాని నిర్మించనున్నారని, దీనికి బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తారని, పవన్ కు రూ. 40 కోట్లు ఆఫర్ చేశారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై నేడు బండ్ల గణేశ్ స్పందించారు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఓ ట్వీట్ పెడుతూ, ఇది నిజం కాదని స్పష్టం చేశారు. తన బ్యానర్ లో ఏ సినిమా కూడా ఇంతవరకూ ఫైనలైజ్ కాలేదన్నారు. ఏదైనా సినిమా ఉంటే మొట్టమొదట అనౌన్స్ చేసేది తానేనని అన్నారు.

Leave a Response