‘గుణ 369’ నుంచి ఫస్టులుక్..

యాంగ్ హీరో కార్తికేయ వైవిధ్యభరితమైన పాత్రలకి ప్రాధాన్యతనిస్తూ దూసుకెళ్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన ఒక వైపున ‘హిప్పీ’ చేస్తూ, మరో వైపున ‘గుణ 369’ సినిమా చేస్తున్నాడు. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు ఈ సినిమా యూనిట్. రెడ్ కలర్ షర్ట్ తో .. లుంగీ పైకెత్తి కట్టి .. కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని ఈ పోస్టర్ లో కార్తికేయ కనిపిస్తున్నాడు.

ఈ లుక్ లో ఆయన మరింత హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. ఈ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాడు. అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను, తిరుమల రెడ్డి – అనిల్ కడియాల నిర్మిస్తున్నారు. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకంతో కార్తికేయ వున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.

Leave a Response