టాలీవుడ్ యాంగ్ హీరో సూర్య, సెల్వరాఘవన్ దర్శకత్వంలో అభిమానుల ముందుకు వస్తున్న సినిమా ‘ఎన్జీకే’. ఈ సినిమా ఈ నెల 31వ తేదీన విడుదల కానుంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఇదే రోజున ఈ సినిమా విడుదలవుతోంది. దాంతో సూర్య .. రకుల్ .. సాయిపల్లవి ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా వున్నారు.ప్రమోషన్స్ లోను రకుల్ .. సాయిపల్లవి ఎడముఖం పెడముఖంగా వుంటున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ సినిమాలో తన పాత్రకంటే సాయిపల్లవి పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఉందనీ, సెట్లో తనకంటే ఆమెనే ఎక్కువగా గౌరవిస్తున్నారంటూ షూటింగు సమయంలో రకుల్ అసహనాన్ని ప్రదర్శించిందట. అందువల్లనే ఆమెతో సాయిపల్లవి ముభావంగా ఉంటోందని చెప్పుకుంటున్నారు. మరోపక్క, ఈ సినిమాలో ఇద్దరి పాత్రలకి సమానమైన ప్రాధాన్యత ఉంటుందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు.
previous article
రాజ్ తరుణ్ పెళ్లి…కారణం
next article
‘గుణ 369’ నుంచి ఫస్టులుక్..
Related Posts
- /No Comment
“గ్యాంగ్ లీడర్” లో “RX100”
- /No Comment