టాలీవుడ్ సీనియర్ హీరో చిరంజీవి ‘సైరా’ సినిమాలో నటిస్తున్నాడు. చరణ్ నిర్మిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. అక్టోబర్ 2వ తేదీన ఈ సినిమాను విడుదల చేసే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. తెలుగుతో పాటు వివిధ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
ఈ నేపథ్యంలో ఈ సినిమా హిందీ వెర్షన్ డిస్ట్రిబ్యూషన్ హక్కులు భారీ రేటుకు అమ్ముడైనట్టుగా తెలుస్తోంది. ‘కేజీఎఫ్’ సినిమాను బాలీవుడ్లో సమర్థవంతంగా పంపిణీ చేసిన ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ సంస్థవారు, ‘సైరా’ హిందీ వెర్షన్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను సొంతం చేసుకున్నట్టుగా సమాచారం. ‘సైరా’ ప్రత్యేకతలను .. విశేషాలను పరిగణనలోకి తీసుకుని ఈ సంస్థ ఫ్యాన్సీ రేటుతో హక్కులను పొందినట్టుగా చెబుతున్నారు.