అదరగొడుతోన్న ప్రభాస్ పోస్టర్….

టాలీవుడ్ యాంగ్ హీరో ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో ‘సాహో’ సినిమా అభిమానుల ముందుకు వాస్తుంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మితమవుతోన్న ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ కథానాయికగా కనిపించనుంది. ఆగస్టు 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఈ సినిమా నుంచి ప్రభాస్ పోస్టర్ ఒకటి రిలీజ్ చేయగా దానికి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి మరొక పోస్టర్ ను విడుదల చేశారు. బైక్ పై ప్రభాస్ దూసుకెళ్లే ఈ పోస్టర్ ఆయన అభిమానులను ఖుషీ చేసేలా వుంది. ఈ సినిమాలో బైక్ ఛేజింగ్ సీన్స్ హాలీవుడ్ సినిమాల స్థాయిలో వుంటాయనే విషయం తెలిసిందే. యాక్షన్ సీన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయనే ప్రచారం మొదటి నుంచి సాగుతూనే వుంది. ప్రభాస్ చేసిన సాహసోపేత విన్యాసాల కోసం అభిమానులంతా వేచి చూస్తున్నారు.

Leave a Response