టాలీవుడ్ యాంగ్ హీరో ప్రభాస్ నటిస్తున్న సినిమా ‘సాహో’. ఈ సినిమా నుంచి సంగీత దర్శకులు తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే ‘సాహో’ పూర్తవుతున్న క్రమంలో శంకర్-ఎహసాన్-లాయ్ తప్పుకోవడంతో అంతా షాక్ అయ్యారు. నేడు వారు తాము ఈ సినిమా నుంచి తప్పుకోవడానికి గల కారణాలను వివరించారు. బయటి కంపోజర్ల నుంచి మరిన్ని పాటలను జత చేయాలని చిత్రబృందం భావిస్తోందని, అది తమకు కాస్త ఇబ్బందికరంగా అనిపించిందని అన్నారు.సినిమాకు తాము మాత్రమే సంగీత దర్శకులుగా ఉండాలని భావించామని, అందుకే తప్పుకున్నట్టు తెలిపారు. ఈ సినిమాకు మరికొందరి చేత కూడా సంగీతం చేయించాలన్న నిర్మాణ సంస్థ ఆలోచన తమకు నచ్చలేదని, అదే విషయం వారికి చెప్పేశామని, అందుకే తప్పుకున్నామని శంకర్-ఎహసాన్-లాయ్ తెలిపారు.
previous article
నిర్మాతగా మరీనా దర్శకుడు…
Related Posts
- /No Comment
దేవుడి దర్శనం …. నాని ప్రసన్నం
- /No Comment