ఉక్కిరిబిక్కిరవుతోన్న రకుల్…

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా రకుల్ తన జోరును కొనసాగిస్తోంది. ఇక తమిళంలోను తన సత్తాను చాటుకునే ప్రయత్నాల్లో కొంతవరకూ సక్సెస్ అయింది. ఆ తరువాతనే ఆమె హిందీ సినిమాలపై దృష్టి పెట్టింది. గతంలో ఆమె హిందీలో చేసిన రెండు సినిమాలు పరాజయం పాలయ్యాయి. దాంతో ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆమె అజయ్ దేవగణ్ సరసన ‘దే దే ప్యార్ దే’ సినిమా చేసింది.Image result for rakul hot pics10 రోజుల్లో 75 కోట్లు సాధించిన ఈ సినిమా, 18 రోజులకి ఓవర్సీస్ కలుపుకుని 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. అజయ్ దేవగణ్ వంటి సీనియర్ స్టార్ హీరో సినిమాకి ఈ వసూళ్లు రావడానికి ఇన్ని రోజులు పట్టడం మరీ సంతోషించే విషయమేమీ కాదు. కానీ సుదీర్ఘకాలం తరువాత తన కల నెరవేరినందుకు మాత్రం రకుల్ సంతోషంతో తెగ మురిసిపోతోంది.

Leave a Response