టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా రకుల్ తన జోరును కొనసాగిస్తోంది. ఇక తమిళంలోను తన సత్తాను చాటుకునే ప్రయత్నాల్లో కొంతవరకూ సక్సెస్ అయింది. ఆ తరువాతనే ఆమె హిందీ సినిమాలపై దృష్టి పెట్టింది. గతంలో ఆమె హిందీలో చేసిన రెండు సినిమాలు పరాజయం పాలయ్యాయి. దాంతో ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆమె అజయ్ దేవగణ్ సరసన ‘దే దే ప్యార్ దే’ సినిమా చేసింది.10 రోజుల్లో 75 కోట్లు సాధించిన ఈ సినిమా, 18 రోజులకి ఓవర్సీస్ కలుపుకుని 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. అజయ్ దేవగణ్ వంటి సీనియర్ స్టార్ హీరో సినిమాకి ఈ వసూళ్లు రావడానికి ఇన్ని రోజులు పట్టడం మరీ సంతోషించే విషయమేమీ కాదు. కానీ సుదీర్ఘకాలం తరువాత తన కల నెరవేరినందుకు మాత్రం రకుల్ సంతోషంతో తెగ మురిసిపోతోంది.
previous article
పవన్ కల్యాణ్ న్యూలుక్……
next article
అలాంటి డబ్బు నాకు అవసరం లేదు..
Related Posts
- /No Comment