టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి. ప్రస్తుతం ఎన్టీఆర్ .. చరణ్ హీరోలుగా ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా షూటింగ్ లో బిజీ. ఈ సినిమా మూడవ షెడ్యూల్ షూటింగు జరుగుతూ ఉండగా, జిమ్ లో చరణ్ కాలు బెణకడం .. ఆ తరువాత ఎన్టీఆర్ చేతికి గాయం కావడం జరిగింది. దాంతో ఈ సినిమా షూటింగుకి కొన్ని రోజుల పాటు విరామాన్ని ప్రకటించారు. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా షూటింగును అతిత్వరలో మొదలుపెట్టనున్నారు. హైదరాబాద్ శివారు గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీ పరిసరాల్లో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ .. చరణ్ .. అలియా భట్ తదితరులు ఈ షూటింగులో పాల్గొననున్నట్టు సమాచారం. ఇప్పటికే అనుకోని అవాంతరాల కారణంగా ఆలస్యం కావడంతో, ఇక పెద్ద గ్యాప్ తీసుకోకుండా చకచకా షూటింగు కానిచ్చేయాలనే నిర్ణయానికి రాజమౌళి వచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు.
previous article
సంక్రాంతి బరిలో అల్లు అర్జున్…?
next article
100 కిలోల బరువును ఎత్తిన సమంతా…
Related Posts
- /No Comment
“గ్యాంగ్ లీడర్” లో “RX100”
- /No Comment