కొడుకు కి సారీ చెపుతున్న నాని..?

టాలీవుడ్ హీరో నేచురల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నాని హీరోగా నటిస్తున్న సినిమా ‘జెర్సీ’. ఈ సినిమా విడుదలకు ముస్తాబువుతుంది. ఈ నేపథ్యంలో, ప్రమోషన్ కార్యకలాపాల్లో బిజీగా ఉన్న నాని, తాజాగా మరో సరదా ట్వీట్ పెడుతూ, తన కుమారుడు అర్జున్ కు సారీ చెప్పాడు. ఇప్పటికే టీజర్‌, ట్రయిలర్ లతో సినీ ప్రేక్షకులను ఆకర్షించిన సినిమాలో హీరో పేరు అర్జున్. నాని కుమారుడి పేరు కూడా అర్జునే. ఇక నాని తాజాగా పోస్ట్ చేసిన ఫొటోలో “మా డాడీ నా పేరు దొంగిలించాడు” అని రాసి ఉన్న టీ షర్ట్‌ ను అర్జున్ వేసుకోగా, పక్కనే కూర్చున్న నాని తన టీ షర్టుపై అర్జున్‌ 36 అని రాసుంది. ఈ ఫొటోకు “సారీరా జున్ను తప్పలేదు” అని క్యాఫ్షన్‌ పెట్టాడు. ఈ సినిమాలో నాని 36 ఏళ్ల క్రికెటర్ అర్జున్ పాత్రలో కనిపిస్తాడు. ‘మళ్లీరావా’ ఫేమ్ గౌతమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కన్నడ నటి శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అవుతోంది.

Leave a Response