టాలీవుడ్ లో వచ్చినా సినిమాలో ఆణిముత్యాల్లాంటి సినిమా ‘మూగమనసులు’. ఇప్పుడు అదే టైటిల్ తో మరో ప్రేమకథను అభిమానుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై సౌజన్య దర్శకత్వంలో ఒక ప్రేమకథ పట్టాలెక్కనుంది. ఈ సినిమా ద్వారానే సౌజన్య దర్శకురాలిగా పరిచయం కానున్నారు. తాజాగా ఈ సినిమాకి ‘మూగమనసులు’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ‘జెర్సీ’ ద్వారా పరిచయమైన హరీశ్ కల్యాణ్ ను హీరోగా ఎంపిక చేసుకున్నారు. కథానాయిక ఎంపిక ప్రక్రియను కూడా పూర్తి చేయనున్నారు. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.
previous article
స్టార్ హీరో ఇంటికి ముందు బి.జె.పి కార్యకర్తల హంగామా…
Related Posts
- /No Comment